అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

కడప : నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ లవన్న తెలిపారు ఆదివారం కడప నగరంలోని పలు సూపర్ మార్కెట్లలో ఆయన నగరంలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా అమ్మకాలు చేపడుతున్న వివిధ సరుకుల ధరలను ఆయన పరిశీలించారు సరుకుల ధరలపై స్థానిక వినియోగదారులను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులు తప్పనిసరిగా కరోనా నివారణ చర్యలను పాటించాలని అందుకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలన్నారు. ముఖ్యంగా వినియోగదారులు సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Leave a Reply