అభివృద్ధి, పారిశుభ్రతకు ప్రాధాన్యత కమిషనర్ నరసింహారెడ్డి

వులి వెందుల :  పట్టణంలో నీటి నరఫరా వీధి దీపాల నిర్వహణ, యూజీడీ నిర్వహణ, పింఛన్లు, రేషన్, తదితర అంశాల పై ప్రత్యేకదృష్టి సారించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయా శాఖల అధికారులకు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయ సభా భవనంలో నిర్వహించిన నమావేశంలో కరోనా-19 పై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి పట్టణంలోని వార్డు లకు ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. ప్రత్యేక అధికారి ఆయావార్డు నుదు అవసరమైన పారిశుద్ధ్య పనులు, నీటి సరఫరా, అవసరమైనచోట సోడియం హైపోక్లోరైడ్ పిచికారి చేయుట, ఇతర ప్రజారోగ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రత్యేక అధికారులు ఎల్లవే ళలా అందుబాటులో ఉండి వార్డు సెక్రటరీలు, వాలెంటీర్లను సమన్వయపరుస్తూ విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. వురపాలక సిబ్బంది సచివాలయ సిబ్బంది, పట్టణ ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా సడుచుకోవాలని సూచించారు. ప్రతిఒక్క సిబ్బంది బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు

Leave a Reply