ఎప్పుడైనా అందుబాటులో ఉంటా :ఎస్పీ
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రజలు ఎవరు కూడా
బయటికి తిరగవద్దని అందరూ ఇంటికే పరిమితం కావాలని
నిరంతరం పోలీసు శాఖ అందుబాటులో ఉంటుందని కడప జిల్లా
ఎస్సీ అనుభ రాజన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ ఇంటికే నిత్యవసర
వస్తువులు డెలివరీ చేస్తామని, అలాగే అత్యవసర పరిస్థితుల్లో వైద్య
చికిత్స కూడా ఏర్పాటు చేస్తామన్నారు. నిత్యావసర సరుకులు
కూరగాయలు, మందులు, వైద్య సేవలు అవసరమైన వారు
0 9 259179 ఈ నెంబర్ కి ఫోన్ చేసి
సమాచారం అందించాలని కోరారు. అలాగే ఎవరైనా అధికధరలకు
నిత్యావసర సరుకులు విక్రయిస్తుంటే ఈ నెంబర్లకు ఫోన్ చేసి
సమాచారం అందిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని
అన్నారు.
Source : Manam News
Kade Pavan Kumar Yadav
Latest posts by Kade Pavan Kumar Yadav (see all)
- గండికోటలో తగ్గుతున్న నీటిమట్టం - April 12, 2020
- నాటుసారా స్థావరాలపై దాడి - April 12, 2020
- ఈనెల 15 నుంచి రేషన్ సరుకులు పంపిణీ - April 12, 2020