ఎవరూ అధైర్యపడవద్దు.. అండగా ఉంటాం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

వులివెందుల : కరోనా వైరస్ నియంత్రణ కోనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన విధంగా ప్రజలంతా గత రోజులుగా స్వీయ నిర్భంధంలో ప్రజలు ఉంటూ అన్ని విధాలా సహాయ సహకరాలు అందించడం అభినందనీయమని, అలాగే ప్రజలకు తమ కుటుంబం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ కష్టనుఖాల్లో పాలు వంచుకుంటామని కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం పులివెందుల రూరల్ పరిధిలోని 17 గ్రామాలకు చెందిన కుటుంబాలకు ఆయన 13 రకాల నిత్యావసర నరుకులను అందించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ముఖ్యముత్రి జగన్మోహన్ రెడ్డి ఆండగా నిలిచే విధంగా ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకూడదన్న లక్ష్యంతో ప్రతి నిరుపేద కుటుంబానికి ఉచితంగా రేషన్ ను అందిస్తున్నామ న్నారు. పులివెందుల ప్రజానీకానికి ఏ కష్టమెొచ్చినా తమ కుటుంబం ముం దుంటుందని, ఎవరు కూడా అధైర్యవడవద్దన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాను సారం నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్కరికీ నిత్యావసరాలను అందించేం దుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన వెంట పాడా అధికారి అని లకుమార్రెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్చిన్నప్ప, పట్టణ కన్వీనర్ వరప్రసాద్, మండల కన్వీనర్ శివప్రసాద్ రెడ్డి వెంకటనుబ్బయ్య, బలరామిరెడ్డి, వుష్పనాధ్రెడ్డి, సర్వోత్తమరెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అలాగే బిజనంచెర్ల బ్రహ్మానందరెడ్డి సీఎం సహాయనిధికి ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తొండూరు – మండల ఇన్చార్జ్ వైఎస్ మధురెడ్డి పాల్గొన్నారు

Leave a Reply