కంటైన్మెంట్ జోన్లలో.. ప్రత్యేక దృష్టి సారించాలి

వైఎస్ ఆర్ రైతు బరోసా కేంద్రాలు, నాడు-నేడు కార్యక్రమాలు వేగవంతం చేయాలి
నీరు సమస్యలపై కంట్రోల్ రూమ్ కాల్స్ డేటా అందజేయాలి
జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్

కడప : జిల్లాలో కోవిడ్ కేసులు నమోదయిన కంటైన్మెంట్ జోన్లలో ప్రత్యేక దృష్టి సారించి జిల్లాను గ్రీన్ జోన్ గా మార్చేలా.. చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు.
కోవిడ్-19 వ్యాప్తి నియంత్రణ, వైఎస్ఆర్ రైతు భరోసా, మత్స్య బరోసా, రైతు భరోసా కేంద్రాలు (ఆర్ బీసీ) నిర్మాణాలు, వేసవిలో మంచినీటి ఎద్దడి, నాడు-నేడు కార్యకమాల అమలు తీరు, తదితర అంశాలపై… మంగళవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి కలెక్టర్ సి.హరికిరన్తో పాటు, జిల్లా ఎస్పీ అన్బు రాజన్ పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం స్థానిక కలెక్టరేట్ విసి హాలులో.. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ సంబందిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్-19 వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వారి సూచనలను ప్రతి ఒక్కరూ పాటించేలా నోడల్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కంటైన్మెంట్ జోన్ లు కలిగిన మండల తహశీల్దార్లు, మున్సిపల్ కమీషనర్లు, ప్రత్యేకధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా శానిటేషన్ పనులు చేపట్టాలని సూచించారు.
ప్రస్తుతం వలస కార్మికులు సొంత ఊళ్లకు వచ్చేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చిన నేపథ్యంలో… ఎవరైనా జిల్లా వాసులు వచ్చే అవకాశం ఉన్నందున… వారి కోసం ఆయా మండలాల్లో కామన్ క్వరంటైన్ కేంద్రాలను సిద్ధం చేసి ఉంచాలన్నారు. ఇందులో భాగంగా.. ప్రతి గ్రామంలోనూ కనీసం 10 బెడ్లతో క్వారంటీన్ సౌకర్యం కల్పించి, మంచి భోజన వసతులు, పరిశుభ్రమైన మరుగుదొడ్ల సౌకర్యంతో ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలన్నారు.
అధికారులు, ఎస్ హెచ్ఓ లను, ప్రజాప్రతినిధులను కలుపుకుంటూ… కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు సమర్థవంతంగా, భాద్యతయుతంగా కృషి చేయాలన్నారు. జిల్లాను గ్రీన్ జోన్ గా మార్చేందుకు సంబందిత అధికారులు కలిసి కట్టుగా కృషి చేయాలన్నారు.
ప్రధానంగా కోవిడ్-19 వైరస్ ను సమర్థవంతంగా అరికట్టే రాష్ట్ర ప్రభుత్వ చర్యల్లో భాగంగా ఆయా కంటైన్మెంట్ జోన్ లపై ప్రత్యేక దృష్టి పెట్టి, వెరీ ఆక్టివ్, ఆక్టివ్ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు.
ప్రస్తుత లాక్ డౌన్ నేపథ్యంలో… టెలీ మెడిసిన్ ద్వారా.. వైద్య సలహాలు తీసుకొని మందులు వాడవచ్చునన్నారు. అవసరమైన ప్రతి ఒక్కరూ 14410 నంబరుకు ఫోన్ చేసి.. వైద్య సలహాలను తీసుకోవచ్చన్నారు. గ్రామ స్థాయిలో ప్రజా ఉపయోగ ఫోన్ నంబర్లను ప్రతి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని తెలిపారు.

జిల్లాలో అధునాతన సౌకర్యాలతో.. వైయస్ఆర్ గ్రామ వైద్య క్లినిక్ ల ఏర్పాటుపై సంబందిత అధికారులకు, ఇంజనీరింగ్ అధికారులకు సూచనలిచ్చారు. జిల్లాలలో అక్రమ మద్యం, అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో రైతు సంక్షేమంలో ఆర్ బి కె లు మరింత ప్రాధాన్యతతో నడుస్తాయన్నారు. జూన్ 1 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఇందుకోసం జిల్లా, గ్రామ స్థాయిలో అడ్వైసరి బోర్డులను ఏర్పాటు చేయనున్నామన్నారు.
రైతు భరోసా కేంద్రాలు (ఆర్ బికె) ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మౌలిక వసతుల కల్పన, మరికొన్ని భవనాల నిర్మాణం కోసం చేపట్టే పనులు వేగవంతం చేయాలన్నారు.

ఈ ఖరీఫ్ సీజన్ ఆరంభానికి రైతులకు చేయూతగా రైతు భరోసా పథకం ద్వారా… ఈ నెల 15వ తేదీన ఆర్ధిక సాయం అందించనున్నామన్నామని, సంబందిత కార్యాచరణను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ జేడీని ఆదేశించారు. ఈ నెల
6న మత్స్యకార భరోసా కార్యక్రమం, మే 15 న రైతు భరోసా పంపిణీ కార్యక్రమాలకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. అందుకోసం గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల నమోదు కార్యక్రమం పక్కాగా జరగాలని, ఏ ఒక్కరూ కూడా అర్హత ఉండి, లబ్ది పొందలేకపోయామనే ఫిర్యాదు చేయకూడదన్నారు.
పేదలందరికీ ఇళ్ల పట్టాలు పథకం క్రింద.. జిల్లాలో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నామని, జూలై 8న ఇళ్ల స్థలాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సంబందిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కు నీటి సమస్యపై స రోజువారీ కాల్స్, ఫిర్యాదుల డేటాను ప్రతిరోజు తనకు సమర్పించాల్సి ఉంటుందని ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఇంజినీర్లకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
నాడు-నేడు లో భాగంగా జిల్లాలో అభివృద్ధి చేయనున్న పాఠశాలలు, వైద్య కేంద్రాల్లో పనులపై కలెక్టర్ సంబందిత శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గౌతమి, డిఆర్వో రఘునాథ్, శిక్షణా కలెక్టర్ శ్రీవాస్ నుపూర్, ఎస్డిసి చిన్నరాముడు, వ్యవసాయ శాఖ జెడి మురళీకృష్ణ, ఉద్యానవన శాఖ ఎడి మధుసూదన్ రెడ్డి, డ్వామా పిడి యదుభూషన్ రెడ్డి, సిపిఓ తిప్పేస్వామి, డిఈ ఓ శైలజ, ఎస్ ఎస్ ఏ పిడి ప్రభాకర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మల్లికార్జునప్ప, పంచాయతీరాజ్, ఇతర ఇంజనీరింగ్ శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply