కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి

ప్రతి డివిజన్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం తప్పక స్ప్రే చేయాలి – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ భాష.

కడప : – కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరప్రాంతాలు శుభ్రంగాఉంచుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్బాష పేర్కొన్నారు.
గురువారం ఉప ముఖ్యమంత్రి వర్యులు 14 వ డివిజన్ ప్రకాష్ నగర్ లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం స్ప్రే చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలన్నారు. పట్టణంలోని 50 డివిజన్లలో ప్రతిరోజు సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం స్ప్రే చేయాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. ఈ ద్రావణం స్ప్రే చేయడంవల్ల క్రిమికీటకాలు చనిపోయి కొంతవరకూ కరోనా ను నివారించవచ్చునన్నారు. దీంతో పట్టణంలోని అన్ని డివిజన్లలో సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసర ప్రాంతాలలో చెత్తాచెదారం తొలగించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో 14 వ డివిజన్ ఇంచార్జి డి. బాబు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave a Reply