కరోనా వైరస్ ను తరిమికొడదాం
జిల్లా నుంచి కరోనా వైరస్ ను తరిమివేయడానికి
వైద్య ఆరోగ్య శాఖ ద్వారా శాయశక్తులా కృషి చేస్తున్నామని
డిఎంహెచ్ఓ డా.ఎన్. ఉమాసుందరి తెలిపారు. స్థానిక డిఎంహెచ్ ఓ
కార్యాలయంలోని తన ఛాంబరులో జిల్లాలో కరోనా వైరస్
నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో
డిఎంహెచ్ ఓ మాట్లాడుతూ… కరోనా వైరస్ మహమ్మారిని తరిమి
కొట్టడానికి కలెక్టర్ సి.హరికిరణ్ స్వీయ పర్యవేక్షణలో జిల్లా
యంత్రాంగంతో కలిసి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు
చెప్పారు
విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 4941 మందిని ట్రేస్ చేసి, ట్రాక్’
చేసి వారందరిని సర్వైలెన్స్ లో పెట్టి హోమ్ ఐసోలేషన్ లో కూడా
పెట్టడం జరిగిందన్నారు. వారెవరికీ కూడా పాజిటివ్ రాలేదన్నారు
జిల్లాలో ప్రస్తుతం 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని
ఇందులో 23 మంది ఢిల్లీ సదస్సుకు వెళ్లి వచ్చిన వారికి పాజిటివ్
వచ్చిందని, వారి ప్రైమరీ కాంటాక్ట్ నలుగురికి పాజిటివ్ రావడం
జరిగిందని, నిన్న మరొక ప్రైమరీ కాంటాక్ట్ నకు పాజిటివ్
వచ్చిందన్నారు. ఈ 28 కేసులలో ప్రైమరీ కాంట్రాక్టు వారిని
క్వారం టైన్ లో ఉంచడం జరిగిందని సెకండరీ కాంటాక్ట్ వారిని
కూడా హోమ్ ఐసోలేషన్లో ఉంచడం జరిగిందన్నారు. జిల్లాలో
క్వారంటైన్ సెంటర్లు ఉన్నాయన్నారు. ప్రస్తుతం క్వారంటైన్
సెంటర్లలో వెయ్యి మంది దాకా ఉన్నారు. ఈ కార్యక్రమంలో
ఏడి పి. వేణుగోపాల్ రెడ్డి, డివిజనల్ పిఆర్ ఓ లు
సమాచార
శాఖ
సిహెచ్ పురుషోత్తం, డి. మస్తాన్ సాహెబ్ పాల్గొన్నారు
Kade Pavan Kumar Yadav
Latest posts by Kade Pavan Kumar Yadav (see all)
- గండికోటలో తగ్గుతున్న నీటిమట్టం - April 12, 2020
- నాటుసారా స్థావరాలపై దాడి - April 12, 2020
- ఈనెల 15 నుంచి రేషన్ సరుకులు పంపిణీ - April 12, 2020