కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోండి

కంటోన్మెంట్ జోన్లలో తప్పనిసరిగా 10 ఇండ్లకు ఒక్కరిని ర్యాన్ డం గా స్వాబ్ టెస్టులు నిర్వహించండి
కంటోన్మెంట్ జోన్లలో స్వాబ్ టెస్టులు చేయబడునని ముందస్తుగానే ఆటోల ద్వారా ప్రచారం చేయాలి
కంటోన్మెంట్ జోన్లలో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేయండి.
కంటోన్మెంట్ జోన్లలో అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపై తిరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.
కడప నగరంలోని కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీచేసిన జిల్లా కలెక్టర్ సి హరి కిరణ్.

కడప : జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ సి. హరి కిరణ్ ఆదేశించారు. శుక్రవారం కడప నగరంలోని కంటైన్మెంట్ జోన్లు అయిన కోటి రెడ్డి సర్కిల్, బి కె ఎమ్ స్ట్రీట్, హాబీబుల్లా స్ట్రీట్ , ఒకటవ గాంధీ విగ్రహం తదితర ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ సి. హరి కిరణ్ పర్యటించారు. కంటైన్మెంట్ జోన్లలో రోడ్లపై తిరుగుతున్న వారిని ఎందుకు తిరుగుతున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, లేకపోతే ఇళ్లలోనే ఉండాలని వారికి సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెంద కుండా కంటోన్మెంట్ జోన్లలో ప్రజలు అనవసరంగా అటు ఇటు తిరగకుండా కేవలం వైద్య చికిత్స కు లేదా అత్యవసర పరిస్థితులు ఉంటే నే తిరిగేందుకు అనుమతించాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించారు. కొంతమంది బ్యాంకుల కని, పోస్ట్ ఆఫీసులకు అని, ఏ టి ఎమ్ లకని తిరుగుతూ ఉండటం గమనించడం జరిగిందని అలా తిరగడం మంచిది కాదని అన్నారు. అత్యవసరమైతే కంటైన్మెంట్ జోన్ల పరిధిలో లేని బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, ఏటీఎం ల ను ఉపయోగించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్స్ లో ముఖ్యంగా పోలీస్, వైద్య ఆరోగ్య, రెవెన్యూశాఖ లు తప్ప ఇతరులు అనవసరంగా తిరుగరాదన్నారు. ఈ మూడు శాఖల పనితీరు సంతృప్తి కరంగా ఉందని తెలిపారు. శానిటేషన్ బాగుందని, మరింత మెరుగ్గా శానిటేషన్ పనులను చేపట్టాలని మునిసిపల్ కమీషనర్ లవన్నను ఆదేశించారు. స్ప్రే లాంటి పారిశుద్ధ్య పనులను మనుషులతో చేయించాలంటే అధిక సమయం పడుతుందని , అదే పనులను ట్రాక్టర్, కంటైనర్ లతో పైపుల ద్వారా స్ప్రే చేయిస్తే తక్కువ సమయంలో ఎక్కైవ పనులను చేయగలుగుతామని , ఆ విధంగా చేయించాలని కమీషనర్ తో అన్నారు. ఫీవర్ సర్వే చేస్తున్న విధానాన్ని ఆశా, ఏ ఎన్ ఎమ్ లతో కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వారితో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. అలాగే స్వాబ్ టెస్టులు, ఫీవర్ సర్వే పై డాక్టర్ కావ్య కలెక్టర్ కు వివరించారు. అందుకు కలెక్టర్ కంటైన్మెంట్ జోన్స్ లో రెండు రోజులకు ఒక సారి మొబైల్ యూనిట్ వెహికల్ పంపుతామని ప్రతి 10 ఇండ్లకు ఒక్కరికి స్వాబ్ టెస్ట్ చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు ఇన్ఫెక్షన్ ఉన్న కంటైన్మెంట్ జోన్ లో కరోనా వైరస్ ప్రభావితం అయి ఉన్నచోట ఏదో ఒక కారణం చెప్పి లోపలికి బయటకు తిరగడం గమనించడం జరిగిందని కంటైన్మెంట్ జోన్ లో అత్యవసర మైతే తప్ప తిరగరాదని అన్నారు. అత్యవసర చికిత్స కోసం, ఉద్యోగ విధి నిర్వహణ కొరకు మాత్రమేనని వెళ్లాలని అన్నారు.
రహదారులలో ట్యాంకర్ల ద్వారా హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించాలని మున్సిపల్ కమిషనర్ లవన్న ను ఆదేశించారు. రోడ్లపై ప్రజలు తిరగకుండా కట్టుదిట్టమైన పోలీసు భద్రతా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప అనుమతించరాదని కడప డి.ఎస్.పి సూర్యనారాయణ ను ఆదేశించారు.

త్వరితగతిన దిశా పోలీస్ స్టేషన్ ఆధునీకరణ పనులను పూర్తి చేయండి :

పాత 1వ టౌన్ పోలీస్ స్టేషన్ ను దిశా పోలీస్ స్టేషన్ గా ఆధునీకరణ చేసే పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ సి హరి కిరణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దిశ పోలీస్ స్టేషన్ ఆధునీకరణ చేసేందుకు దాదాపు రూ. 65 లక్షలు కేటాయించాం. మార్చి లేదా ఏప్రిల్ మాసంలో ఆధునీకరణ పనులను పూర్తి చేయాలని అనుకున్నా కరోనా వైరస్ వల్ల పనులు ముందుకు సాగలేదన్నారు. ఇప్పటి నుంచి వేగంగా పనులు చేసి రానున్న జూన్ మాసంలోగా అందుబాటులో కి తేవాలని చెప్పారు. ఈ ఆధునికీకరణ పనులపై కడప ఆర్డీవో మలోల, మున్సిపల్ కమిషనర్ లవన్న, డిఎస్పీ సూర్యనారాయణ లకు తగు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో కడప తహసిల్దార్ శివరామిరెడ్డి, వైద్యాధికారి డాక్టర్ కావ్య తదితర శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply