కరోనా సహాయనిధికి 50వేల రూపాయలు విరాళం

పులివెందుల : ఉండే 1వ వార్డు పెద్ద రంగాపురం గ్రామానికి చెందిన పులివెందుల నియోజకవర్గ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు వెన్నపూస రామ్ లక్ష్మణ్ రెడ్డి వారి తండ్రి వైఎస్సార్సీపీ నాయకులు వెన్నపూస రామ మోహన్ రెడ్డి కరోనా సహాయ నిధికి 50 వేల రూపాయల నగదును కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి శుక్రవారం అందజేశారు. నియోజకవర్గ పరిధిలో లాక్ డౌన్ కారణంగా పూట గడవని నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల సహాయార్థం ఈ మొత్తాన్నీ వెచ్చించి ఆదుకోవాలని కోరారు కరోనా విపత్కర పరిస్థితుల్లో పులివెందులలోని పార్టీ నాయకులు యువకులు అందరూ వెన్నపూస రామ్ లక్ష్మణ్ రెడ్డి వారి తండ్రి వెన్నపూస రామ మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని నిరుపేదలకు తమ వంతు చేయూతనందించి బాసటగా నిలవాలని వై.యస్ అవినాష్ రెడ్డి పిలుపునిచ్చారు.

Leave a Reply