కార్మికుల త్యాగాలకు ప్రతీక మేడే

కడప : కార్మికుల త్యాగాలకు మేడే ప్రతీకగా నిలుస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. శుక్రవారం కడప నగరంలోని మృత్యుంజయకుంట కాలనీలోని సీపీఎం నూతన కార్యాలయం పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వద్ద ఆ ఆయన మాట్లాడుతూ.. కార్మికుల పనిదినాల తగ్గింపు కోసం నాడు చికాగో నగరంలో కార్మికులు పెట్టుబడిదారులపై సాగించిన పోరాటంలో చిందించిన రక్తానికి ప్రతిరూపమే ఎర్రజెండా అన్నారు కార్మికుల త్యాగాలను స్మరించుకునే నేపథ్యంలో ప్రతి ఏడాది మే ఒకటవ తేదీన మేడే ను కార్మికుల అంతర్జాతీయ దినోత్సవంగా గుర్తింపు పొందిందన్నారు. గతంలో పన్నెండు గంటల నుంచి పద్దెనిమిది గంటలు వరకు కార్మికులు పనిచేసే వారని, పెట్టుబడిదారులు కార్మికులను కట్టుబానిసలుగా చూశారని అన్నారు. పెట్టుబడిదారుల బానిస సంఖ్యలను తెగ నరికిన విప్లవ చరిత్ర కార్మికులకుందన్నారు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్న నినాదాన్ని తలకెత్తుకుని పెట్టుబడిదారీ వ్యవస్థపై సాగించిన యుద్ధంలో విజయం సాధించి ఘనతకెక్కిన చరిత్ర కార్మికులదన్నారు, సోషలిజం తప్ప వేరు మార్గం లేదని చాటి చెప్పారన్నారు కాగా నాడు త్యాగాలతో సాధించుకున్న కార్మిక హక్కులను నేడు కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన చట్టాలను రూపొందించి కార్మిక హక్కులను కాలరాస్తోందన్నారు. అందులో భాగంగానే పన్నెండు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. 44 రకాల చట్టాలను కోడ్ లుగా మార్చేసి కార్మికుల గొంతునులిమేసిందని ఆవేదనను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు సంఘటితం కావాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రామ్మోహన్, జిల్లా కమిటీ సభ్యులు అన్వేష్, దస్తగిరిరెడ్డి, నాయకులు చంద్రారెడ్డి, సిద్దయ్య, మధు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply