కూరగాయల మార్కెట్ ను సందర్శించిన మున్సిపల్ కమిషనర్

కడప :  నగరంలో ఏర్పాటు చేసిన వివిధ కూరగాయల మార్కెట్లను మున్సిపల్ కమిషనర్ ఆదివారం ఉదయం పర్యవేక్షించారు. ఈ మేరకు కడప నగరంలోని జిల్లా పరిషత్తు ప్రాంగణంలో రైతు బజారులో ఏర్పాటు చేసిన మార్కెట్లను ఆయన సందర్శించి వినియోగదారులకు పలుసూచనలు చేశారు, ప్రధానంగా సామాజిక దూరాన్ని పాటించాలని కొనుగోలు అమ్మకాల సమయంలో వ్యాపారులు వినియోగదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని తప్పనిసరిగా మాస్కులను ధరించాలని ఆయన సూచించారు.

Leave a Reply