కోవిడ్ 19 విపత్తు సాయం లో దాతల సాయం కీలకం సేవా సమితి అధ్యక్షులు రాజు

లాక్ డౌన్ లో ఉన్న నిరుపేద లకు, రెడ్ జోన్ ప్రజలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ

వేముల  : మండలం గొందిపల్లి కి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ అయిన దేవన. మధు కిరణ్ సహకారం తో… స్నేహిత అమృత హస్తం సేవా సమితి ఆధ్వర్యంలో… తహసీల్దార్ శ్రీనివాస్, సర్కిల్ ఇన్ స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ నరసింహ రెడ్డి ల సూచన మేరకు.కోవిడ్ 19 విపత్తు సహాయంలో భాగంగా కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ లో ఉండి జీవనానికి ఇబ్బంది పడుతున్న పులివెందుల పట్టణం లోని యర్రగుడి పల్లి లోని.. “గుడ్డ గుడిసె” లలో ఉంటున్న నిరుపేద కుటుంబాలకు, అలాగే “కరోనా పాజిటివ్ రెడ్ జోన్” లో ఉన్న జండా మాను వీధి లోని కుటుంబాలకు… సుమారు 300 కుటుంబాలకు ల్యాబ్ టెక్నీషియన్ మధు కిరణ్, సేవా సమితి అధ్యక్షులు రాజు ల చేతులమీదుగా ఆదివారం పంపిణీ చేయడం జరిగింది

ఈ సందర్బంగా రాజు మాట్లాడుతూ కోవిడ్ 19 విపత్తు సాయం లో దాతలు చేస్తున్న సాయం కీలకం అని, వారి దాతృత్వం ఏంతో గొప్ప అభినందనీయం అన్నారు… ఇలాంటి విపత్తు లో నిరుపేద లకు, రెడ్ జోన్ లో ఉండి సహాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు సాయం చేసే అవకాశం ఇస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు

ఈ కార్యక్రమం లో సేవా సమితి సభ్యులు జనార్దన్, జస్వంత్, చక్రవర్తి, మహేంద్ర, రాజా, వాలంటీర్ లు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply