క్వారంటైన్ కేంద్రాల్లో పారిశుధ్యం పెంపునకు పెద్ద పీట వేయండి : జిల్లా కలెక్టర్

క్వారంటైన్ కేంద్రాల్లో నాణ్యమైన మెనూను అందించండి.
 వైద్యులు, పోలీస్, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు షిఫ్ట్ 
    పద్దతిలో 24 గం. లు క్వారంటైన్ కేంద్రం వద్ద ఉండాలి.

కడప: జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని క్వారంటైన్ కేంద్రాల్లో పారిశుధ్యం పెంపునకు పెద్ద పీట వేయాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కామన్ క్వారంటైన్ కేంద్రాల నోడల్ అధికారులను ఆదేశించారు.  ఆదివారం  కలెక్టర్ కార్యాలయం లోని వీసి హాల్ నందు క్వారంటైన్ కేంద్రాల నిర్వహణ, తీసుకోవలసిన జాగ్రత్తలపై నోడల్ అధికారులతో  కలెక్టర్ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… క్వారంటైన్ కేంద్రాల్లో  చెత్తను తోయడం, బాత్రూములు శుభ్రం చేయడం, దుప్పట్లు , దిండు కవర్లు ఉతకడం .. లాంటి పనులను ఎప్పటికప్పుడు  పారిశుధ్య సిబ్బంది చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  అవసరమైన పారిశుధ్య సిబ్బందిని రోజువారీ ( డైలీ వేజెస్ ) కూలీ విధానంలో నియమించుకోవాలని తెలిపారు. ఇందుకు ప్రభుత్వం నిధులను కూడా కేటాయించిందన్నారు.  పారిశుధ్య సిబ్బందికి మాస్కులు, పర్సనల్ ప్రొటెక్టెడ్ ఎక్విప్మెంట్ (పిపిఇ), సానిటైజర్లు పంపిణీ చేయాలని అన్నారు.  ఆయా క్వారంటైన్ కేంద్రాలలో,  ట్రాన్సిస్ట్ క్వారంటైన్ కేంద్రంలో ,  కోవిడ్ ఆసుపత్రిలో  ఉన్న వారికి  ఎటువంటి లోటుపాట్లు లేకుండా  వైద్యులు, పోలీస్, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు షిఫ్ట్  పద్దతిలో 24 గం. లు అందుబాటులో ఉండేలా  చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  అన్ని కేంద్రాల్లో  వైద్యులు, అంబులెన్సు .. తదితర అత్యవసరమైన ఫోన్ నంబర్స్ తో ఉన్న  పట్టికను రిసెప్షన్ వద్ద ప్రదర్శించాలని అన్నారు.  వాహనాలు అవసరమైతే  ప్రొద్దుటూరు ఆర్టీవో వీర్రాజు కు ఫోన్ చేయాలని తెలిపారు.  ప్రైమరీ కాంటాక్ట్స్ వారికి నెగటివ్ వచ్చినప్పటికీ 14 రోజుల పాటు  క్వారంటైన్లో ఉండి .. ఇంటికి వెళ్లే సమయంలో మరోసారి వైద్య పరీక్షలు చేయించి , ఇంటి వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి , జాగ్రత్తలపై ముద్రించిన పాంప్లెట్ ఇచ్చి ఇంటికి పంపించాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అవగాహన కల్పించాలన్నారు. కేసులు చెక్ చేసే సమయంలో డాక్టర్లు తప్పనిసరిగా కేస్ షీట్ లో వివరాలను నమోదు చేయాలన్నారు. వాడిన సిరెంజులు, నీడిల్స్,

మాస్కులు,  గ్లౌజులు , తదితర బయో మెడికల్ వేస్ట్ ను  ఎక్కడ పడితే అక్కడ వేయకుండా , ఒక పెద్ద కవర్లో వేసి ఉంచి దానిని ఇప్పటికే నిర్దేశించిన ఏజెన్సీకు అందచేయాలన్నారు.

           ఈ కార్యక్రమంలో జేసి గౌతమి, , ట్రైనీ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్, డిఎఫ్ఓ శివ ప్రసాద్ ,  జేసి 2 శివారెడ్డి,  డిఆర్వో రఘునాథ్ , డిఆర్డీఏ, డ్వామా పీడి లు మురళి మనోహర్, యధుభూషణ్ రెడ్డి , డి ఎం & హెచ్ ఓ డా.ఉమాసుందరి, కామన్ క్వారంటైన్ కేంద్రాల నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply