జర్నలిస్టులకు బియ్యం పంపిణీ

రాజంపేట : బైపాస్ లో గల మేడా నిలయం నందు సమాజ హితం కోరి నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టులకు రాజంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యోగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ మేడా వెంకట మల్లికార్జున రెడ్డి చేతుల మీదుగా ఆదివారం బియ్యం పంపిణీ చేశారు. ప్రతి జర్నలిస్టుకి 25 కిలోల జిలకర మసూర బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులందరు ఆయనకు అభినందనలు తెలిపారు. తమను గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉందని ఆయనకు కృతజ్ఞతలు తెలియచేశారు

Leave a Reply