జిల్లాలో కరోనా వైరస్ నివారణకు పక్కా సూక్ష్మ ప్రణాళికలను అమలు చేస్తున్నాం : కలెక్టర్ సి.హరి కిరణ్.

జిల్లాలో 30 పాజిటివ్ కేసులు, 6 రెడ్ జోన్లు ఉన్నాయి.

కంటైన్మెంట్ జోన్, క్వారంటైన్ లలో పటిష్టమైన చర్యలు.

వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కి ఆదివారం  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించిన కలెక్టర్.

కడప మనం న్యూస్ ఏప్రిల్ 13: జిల్లాలో కరోనా వైరస్ కోవిడ్19 నివారణ, నియంత్రణకు పక్కా సూక్ష్మ ప్రణాళికలను అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సి.హరి కిరణ్ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. ఆదివారం ఉదయం కోవిడ్19 అంశంపై విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎం గౌతమి తో పాటు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా నిర్వహించిన సమీక్షలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ….  జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, ఒక గ్రామీణ ప్రాంతంలో కలిసి 30 పాజిటివ్ కేసులు, 6 రెడ్ జోన్లు ఉన్నాయి.  కంటైన్మెంట్ జోన్ లలో పకడ్బందీగా లాక్ డౌన్, కోవిడ్19 నివారణ చర్యలను అమలు చేస్తున్నాం. క్వారంటైన్ కేంద్రాలలో ప్రోటోకాల్ మేరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ చర్యలను పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. కోవిడ్19 నివారణకు సూక్ష్మ ప్రణాళికలు అమలు చేస్తున్నామని, దాని ప్రకారం అధికారులను కూడా నియమించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని కంటైన్మెంట్ జోన్ లలో జిల్లా kovid ప్రత్యేక అధికారి కూడా పరిశీలించాలని ఆయన కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా మార్కెట్లను వీలైనంత ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నామని, ఆటోలు రిక్షాలు ద్వారా కూడా కూరగాయలు ప్రజల వద్దకు పంపుతున్నామని, అధిక ధరలకు అమ్మకుండా ఉండేందుకు ధరల పట్టికను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం మాంసం దుకాణాలను మూసి వేయడం జరిగిందన్నారు.

 కంటైన్మెంట్ జోన్ లో శాంపిల్స్ సేకరణ

     జిల్లాలో ఇప్పటివరకు 1230 శాంపిల్స్ తీశామని, అందులో 25 శాతం  కంటైన్మెంట్ జోన్ లో ఉన్నట్లు చెప్పారు. అలాగే కంటైన్మెంట్ జోన్ పనిచేస్తున్న హెల్త్ వర్కర్లు, వాలంటీర్లకు 10% శాంపిల్స్ తీశామని, హోమ్ ఆర్బిటర్, అనుమానిత లక్షణాలున్నవారికి 10 శాతం మేర శాంపిల్స్ తీసినట్లు చెప్పారు. ప్రభుత్వం సూచించిన ప్రోటోకాల్ ప్రకారం అన్ని సెగ్మెంట్ లను కవర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన 236 ప్రైమరీ కాంట్రాక్టులకు కూడా శాంపిల్స్ తీయడం జరిగిందని, అందులో 50 తప్ప మిగిలిన అన్నిటికీ రిజల్ట్స్ వచ్చినట్టు చెప్పారు. జిల్లాలో టెస్టింగ్ కెపాసిటీ పెరిగిందని, 2 మొబైల్ అంబులెన్స్  ల ద్వారా కూడా పరీక్షలు చేస్తున్నామని, వారానికి దాదాపు 700 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

 క్వారంటైన్ కేంద్రాలలో వసతులు

      రెండువేల బెడ్ లతో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇండివిడ్యువల్ రూములకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అవి నిండితే కామన్ క్వారంటైన్ లో ఉంచుతున్నట్లు చెప్పారు. కామన్ క్వారంటైన్ కేంద్రాలే కాకుండా ట్రాన్సిట్  క్వారంటైన్ ను కూడా జిల్లాలో ఏర్పాటు చేశామన్నారు.  అనుమానితులకు త్రోట్ స్వాబ్ శాంపిల్ తీసి పరీక్ష కొరకు పంపిన  అనంతరం ఫలితం వచ్చేదాకా ట్రాన్సిట్  క్వారంటైన్ కేంద్రంలో కూడా బాత్రూం సౌకర్యం ఉన్న ఇండివిడ్యువల్ రూమ్లలో వారిని ఉంచుతున్నామని, వస్తే జిల్లా kovid ఆస్పత్రికి, నెగిటివ్ వస్తే సమీపంలోని  క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తున్నట్లు చెప్పారు. జిల్లా kovid ఆస్పత్రిలో, క్వారంటైన్ చిత్రం లో ఉన్నవారికి అందరికీ కామన్ గా మెనూ అమలు చేస్తున్నామని, వారందరికీ నాణ్యమైన ఆహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ  క్వారంటైన్  కేంద్రాలను జిల్లా ప్రత్యేక అధికారి సందర్శించి సంతృప్తి వెలిబుచ్చారని, అయినా మరింత మెరుగైన వసతులు కల్పనకు సూచనలు జారీ చేశారని, వాటి అమలుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

 తగినన్ని పీపీఇ  కిట్లు, ఎన్95 మాస్కులు ఉన్నాయి:

     జిల్లాలో ప్రస్తుతం అవసరానికి సరిపడా తగినన్ని పీపీఇ  కిట్లు, ఎన్95 మాస్కులు ఉన్నాయని కలెక్టర్ వివరించారు. ఆరు వెంటిలేటర్లు ఉన్నాయని, అవసరమైన మేర ఇంకా ఏర్పాటు కొరకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వారం పాటు విధులలో పాల్గొన్న డాక్టర్లు, నర్సులను ఏపీటీడీసీ లో క్వారంటైన్ చేస్తున్నట్లు చెప్పారు. డాక్టర్లు, నర్సుల విషయంలో కొంత అనాలసిస్ చేశామని, విధులు నిర్వహించిన వారిని  క్వారంటైన్ చేసే సమయంలో మరొక ఇద్దరు అనస్తీసియా వైద్యులు, 18 మంది టెక్నీషియన్స్ అవసరం కావొచ్చునని అంచనా వేశామని కలెక్టర్ వివరించారు.

       కోవిడ్19 నివారణకు కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు బాగున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలు సూచనల ప్రకారం పటిష్టవంతంగా చర్యలను అమలు చేయాలని, లాక్ డౌన్ ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సూచించారు. అంతకు ముందుగా కోవిడ్19 కు సంబంధించి వివిధ అంశాలలో తీసుకోవాల్సిన చర్యల పై పలు సూచనలు జారీ చేశారు.

      ఈ వీడియో కాన్ఫరెన్స్లో కడప డిఎఫ్ఓ శివ ప్రసాద్, శిక్షణ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్, జేసి2 బి.శివారెడ్డి, డియర్ఓ ఎస్.రఘునాథ్, డిఆర్డిఎ, మెప్మా, పీడీలు, క్వారంటైన్ కేంద్రాల నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply