జువెలర్స్ అసోసియేషన్ రూ.5 లక్షల విరాళం

జువెలర్స్ అసోసియేషన్ రూ.5లక్షల విరాళం దాతల సేవలు మరువలేనివి ఉపముఖ్యమంత్రి అంజద్ బాష

కడప : ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు సహాయం చేయడం ఎంతో పుణ్యమని ఉప ముఖ్యమంత్రి అంజద్ భాష పేర్కొన్నారు ఈరోజు స్టానిక ఎన్ఎఫ్ఎన్ వీధిలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ది కడవ జువెలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేకరించిన ఐదు లక్షల విరాళాన్ని గౌరవ అధ్యక్షుడు జరుగు రాజశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ గోవిందు నాగరాజు , సెక్రటరీ చాన్ బాషా లు ఉప ముఖ్యమంత్రి మైనారిటీ శాఖ మంత్రి ఎస్బి అంజద్ భాష, వైసీపీ కడప పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యుడు, మాజీ మేయర్ సురేష్ బాబులకు రూ.5 లక్షల విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి అంజద్ భాష మాజీ మేయర్ సురేష్ బాబు లు మాట్లాడుతూకరోనా లాక్ డౌన్ సమయంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వ అందించే నిత్యావసర సరుకులతో పాటు నగరంలోని దాతల సహకారంతో నిత్యవసర కిట్లు, కూరగాయలు భోజనం ప్యాకెట్లను అందిస్తున్నామని తెలిపారు.

సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో పుణ్యమని భావించి ది కడప జ్యువెలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం ఐదు లక్షలు విరాళం ఇవ్వడం ఎంతో పుణ్య కార్యం అని వారిని అభినందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి దాతలు దాతలు ముందుకు రావాలని తెలిపారు. ఈ సందర్భంగా ది కడవ జ్యువెలర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు జరుగు రాజశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ గోవిందు నాగరాజు మాట్లాడుతూ కడప కరుణ లాక్ డౌన్ లో దినసరి కూలీలు ఉపాధి లేక ఇబ్బందులు వడడం గమనించి గోల్డ్ షాప్ ల ఆధ్వర్యంలో 5 లక్షల విరాళాలు సేకరించి ఉప ముఖ్యమంత్రి అంజద్ భాష, మాజీ మేయర్ .సురేష్ బాబులకు అందజేయడం జరిగిందని తెలిపారు. లాక్ డౌన్ సమయం లో పేద ప్రజల ఆకలి తీర్చడం తృప్తిని ఇస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ది కడప జ్యువెలర్స్ అసోసియేషన్ నభ్యులు నరసింహ, నగేష్ ఇస్మాయిల్, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply