నిరుపేదలకు అన్నదానం

ప్రొద్దుటూరు : కేంద్రం విధించిన లాక్ డౌన్ కారణంగా  ప్రొద్దుటూరు పట్టణంలోని వాజ్ పేయి నగర్ లో గల దళిత నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు. ఈస్టర్ సందర్భంగా ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో.. ఎనిమిదవ రోజు అన్నదాన కార్యక్రమం సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చల్లా రాజగోపాల్, చర్చి పాస్టర్ రెవ:కె. సంతోష్ ప్రసన్న రావు కర్నూలు పాస్టర్ మాదం భాస్కర్ చేతుల మీదుగా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.చంద్రబాబు, సభ్యులు వై విజయ్ కుమార్, కడప జిల్లా లేబర్ వింగ్ ప్రెసిడెంట్ ఏ. సురేష్ జిల్లా కోశాధికారి దావీదు, వై.చంద్రశేఖర్, యం.చంటి, ఓబులేసు పాల్గొన్నారు.

Leave a Reply