నూతన ఆర్ఐఓ గా చక్రపాణి బాధ్యతలు

రైల్వే కోడూరు : ఇంటర్మీడియట్ ప్రాంతీయ అధికారి (ఆర్ఐఓ) గా చక్రపాణి బాధ్యతలు రైల్వే కోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ చక్రపాణి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఇదివరకు ఆర్వోగా బాధ్యతలు నిర్వహించిన నాగన్న పదవీ విరమణ పొందడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ చక్రపాణిని నియమించారు అందులో భాగంగా శుక్రవారం స్థానిక ఆర్వో కార్యాలయంలో పూర్తి అదనపు బాధ్యతలను చక్రపాణి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఆర్వో నాగన్న తోపాటు పలువురు అధ్యాపకులు అధ్యాపకుల సంఘ నాయకులు నూతన ఆర్వోకు స్వాగతంపలికారు.

Leave a Reply