పారిశుద్ధ్య కార్మికుల సేవలు అద్భుతం.

పారిశుద్ధ్య కార్మికుల సేవలు అద్భుతం.

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ.

కరోనా నివారణకు భౌతిక దూరం తో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలి.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ బాషా.

కడప :  పట్టణంలో పారిశుద్ధ కార్మికుల సేవలు అమోఘమని లాక్ డౌన్ సందర్భంగా గత 22 రోజుల నుంచి పారిశుద్ధ్య కార్మికులు జిల్లాలో మెరుగైన పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్ భాష పేర్కొన్నారు.

                ఆదివారం ఉప ముఖ్యమంత్రి వర్యులు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి, 28 వ డివిజన్  లోని అభిబుల్లస్ట్రీట్, బండ్లమిట్టవీధి, బి కే యం స్ట్రీట్ లలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేశారు.

                  ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ బాషా మాట్లాడుతూ కరోనా నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమన్నారు. పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు వీధి వీధి తిరిగి చెత్తాచెదారం ఎత్తివేస్తూ, డ్రైనేజీ కాలువలు శుభ్రపరుస్తూ రోడ్డుకిరువైపులా బ్లీచింగ్ పౌడర్ చల్లి వీధులను  సుబ్ర పరుస్తున్నారన్నారు. ఇళ్లలోని చెత్తను రోడ్లపైన వేయకుండా మునిసిపాలిటీ వారి చెత్త కుండీలలో వేయాలన్నారు. కరోనా వైరస్ నివారణకు పరిశుభ్రత ఎంతో ముఖ్యమని ఎక్కడైనా చెత్తాచెదారం అధికంగా ఉన్నట్లయితే వెంటనే మునిసిపాలిటీ వారికి తెలియజేయాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కరోనా వైరస్ ను లెక్కచేయకుండా వీధులను శుభ్ర పరచడం ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయమన్నారు.

                ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల ను పంపిణీ చేశారు. అనంతరం హబీబుల్లా వీధి, బండ్లమిట్టవీధి, బి కే యం వీధుల లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని వీధి వీధి తిరిగి స్ప్రే చేశారు. ఈ ద్రావణం స్ప్రే చేయడం వల్ల వీధులలో క్రిమికీటకాలు చనిపోయి కరోనా వైరస్ ను నివారించవచ్చునన్నారు. జిల్లాలో కరోనా నివారణకు ప్రతి ఒకరు లాక్ డౌన్ ను పాటించాలన్నారు. రాబోయే వారం రోజులు అత్యవసర పరిస్థితులలో తప్ప ఇళ్లలో నుంచి ఎవరు బయటకు రాకూడదన్నారు. కరోనా నివారణకు మందు లేదని భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు.

                  ఈ కార్యక్రమంలో 28 వ డివిజన్ ఇంచార్జి షేక్ ఆరిఫుల్ల భాష, మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply