పారిశుద్ధ్య కార్మికుల సేవలు జీవితంలో మరువలేనివి

ఎన్ని జన్మలెత్తినా పారిశుద్ధ్య కార్మికుల రుణం తీర్చుకోలేము – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్బాష

కడప : పట్టణంలో పారిశుద్ధ కార్మికుల సేవలు మరువలేనివని ఎన్ని జన్మలెత్తినా వీరి రుణం తీర్చుకోలేనిదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్బాష పేర్కొన్నారు.
గురువారం ఉప ముఖ్యమంత్రి వర్యులు పాత మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప నగర పంచాయతీ పరిధిలో 660 మంది పారిశుద్ధ కార్మికులు ఉన్నారన్నారు. కరోనా కట్టడి లో భాగంగా వీరు గత 22 రోజుల నుంచి పట్టణంలో మెరుగైన పారిశుద్ధ్య పనులు చేపడుతూ పట్టణాన్ని పారిశుద్ధ్య రహిత పట్టణంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఎన్ని జన్మలెత్తినా పారిశుద్ధ్య కార్మికుల రుణం తీర్చుకోలేని విధంగా తమ సేవలు చక్కగా నిర్వర్తిస్తున్నారన్నారు. పట్టణంలో మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం వల్ల నగరంలో కేవలం 6 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి వారికి 12 వేల నుంచి 18 వేల రూపాయల వరకూ జీతం పెంచడం జరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ ఇలాంటి విపత్తు రాలేదని ఈ విపత్తు వల్ల అమెరికా, చైనా, ఫ్రాన్స్, వంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఎంతోప్రాణనష్టం జరిగిందన్నారు. మన భారత ప్రధాని ముందుచూపు జాగ్రత్తతో లాక్ డౌన్ నిర్వహించి కరోనాను .

చాలావరకూజయింఛామన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు రాకుండా మే 3వ తేదీ వరకు నిర్వహించే లాక్ డౌన్ ను తప్పక పాటించాలన్నారు. లాక్ డౌన్ వల్ల పట్టణంలో ఎంతో మంది పేదలు మూడు పూటల భోజనం లేక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీరిని ఆదుకునేందుకు దాతల సహకారంతో కోటి 25 లక్షల రూపాయలతో పట్టణంలో 25 వేల మందికి నిత్యావసర సరుకుల కీట్స్ ప్రతి డివిజన్ కు 500 కిట్స్ చొప్పున పంపిణీ చేయడం జరిగిందన్నారు. మరియు ప్రతిరోజు ఐదువేల మందికి భోజన ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. లాక్ డౌన్ వల్ల పేదలు ఆకలితో అలమటించ కూడదనే ఉద్దేశంతో ఈనెల 16 వ తేదీ నుంచి రెండవ విడత ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఏప్రిల్ 29వ తేదీ నుంచి మూడవ విడత రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వాలకు ఆదాయం లేక పోయినా ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గా పనిచేస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సేవలను గుర్తించి తమ వంతు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ లవన్న, మాజీ కార్పొరేటర్ పాక సురేష్, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply