ప్రతి కుటుంబాన్ని ప్రతిరోజు సర్వే చేయాలి
Chitvel News : మండలంలో ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతిరోజు అతని ఆరోగ్య సమస్యలను అడిగి సర్వే చేయాలని చిట్వేల్ ఆరోగ్య కేంద్ర వైద్యులు శివ ప్రసాద్ గౌడ్ వాలంటీర్లు కోరారు. చిట్వేలి పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన వాలంటీర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మూడవ స్టేజికి వెళ్లిన కారణంగా మండలంలోని ప్రతి కుటుంబాన్ని ప్రతిరోజు వాలంటీర్లు సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను నమోదు చేయాలని ఆయన తెలిపారు మండలంలో ఏదైనా కుటుంబంలో జలుబు, దగ్గు జ్వరం లాంటి సమస్యలతో ఉన్న వారిని గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డాక్టర్లకు తెలియజేయాలని ఆయన వాలంటీర్లకు తెలిపారు ఉన్నతాధికారుల నుండి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని డాక్టర్ శివప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్వేల్ గ్రామ కార్యదర్సులు మండలంలోని ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.
Kade Pavan Kumar Yadav
Latest posts by Kade Pavan Kumar Yadav (see all)
- గండికోటలో తగ్గుతున్న నీటిమట్టం - April 12, 2020
- నాటుసారా స్థావరాలపై దాడి - April 12, 2020
- ఈనెల 15 నుంచి రేషన్ సరుకులు పంపిణీ - April 12, 2020