బక్కన్నగారిపల్లి గ్రామంలో కూరగాయలు పంపిణీ

వేంపల్లె : జె.మధు నాయక్, మాజీ సర్పంచ్ కృష్ణ నాయక్ సహకారంతో కరోనా వైరస్ నివారణలో భాగంగా వేంపల్లె ఎస్సై తిరుపాల్ నాయక్   వేంపల్లె మండలంలోని బక్కన్నగారిపల్లి గ్రామంలో ప్రజలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ లాక్ డౌన్ ఉన్న కారణంగా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ, ముఖ్యంగా సామాజిక దూరం పాటించాలని సూచించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అలాగే మాస్క్ లేదా చేతిరుమాలును విధిగా ఉపయోగించాలని అత్యవసరమయితే తప్ప అనవసరంగా రోడ్లపై తిరగవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ సర్పంచ్ కృష్ణ నాయక్ వేంపల్లి పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply