మే డే పురస్కరించుకుని కూరగాయలు పంపిణీ

బద్వేలు : మున్సిపాలిటీ 19వ వార్డులోని శివరామకృష్ణ నగర్,రిక్షాకాలనీ లో లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న పేద కార్మికులకు మేడే సందర్భంగా 7 రకాల కూరగాయలను వై.సి.పి రాష్ట్ర బి.సి సెల్ ప్రదానకార్యదర్శి గోపాలస్వామి యాదవ్ పంపిణీ చేశారు. ఈ మేరకు వాహనాల ద్వారా వార్డులోని 700 ఇళ్ళకు సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఇంటికి వాలంటిర్ల ద్వారా పంపిణీ చేశారు. లాక్ డౌన్ లో ప్రతిరోజు పేదలకు తమవంతు సాయం చేస్తున్నామని యాదవ సంఘం నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పోతిరెడ్డి, గంగిరెడ్డి జయరామ్ యాదవ్, పోతుల నాగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply