మొక్కల సంరక్షణకు తగిన చర్యలను చేపట్టాలి – మున్సిపల్ కమిషనర్

కడప : నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని మున్సిపల్ కమిషనర్ ఎస్ లవన్న అన్నారు. ఆదివారం ఆయన కడప నగరంలో పలు వీధుల్లో పర్యటించారు ఈ మేరకు కొత్త బస్టాండు, అప్సర సర్కిల్, కృష్ణా సర్కిల్, నకాష్, బిల్డప్, వినాయక్ నగర్, ఎయిర్ పోర్టు ప్రాంతాల్లో కలియదిరిగారు. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన మొక్కల పెంపకాలను, సంరక్షణను గురించి అధికారులను ఆరా తీశారు. పచ్చదనం ఉంటేనే పర్యావరణం పరిరక్షించబడుతుందని తద్వారా మంచి ఆరోగ్యం ప్రజలకు లభిస్తుందని అన్నారు ప్రధానంగా వేసవిలో మొక్కల సంరక్షణకు తగిన చర్యలను చేపట్టాలని అన్నారు. ప్రధానంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పారిశుధ్య పనులను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.

Leave a Reply