మొరాయించిన సర్వర్లు వినియోగదారుల ఇక్కట్లు : దువ్వూరు

దువ్వూరు : రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు నేటి నుంచి రెండవ విడత రేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టిననేపథ్యం లో చౌదుకాణ డిపోల్లో సర్వర్ పనిచేయకపోవడంతో నానా తిప్పలు పడ్డారు చౌకడిపోల వద్ద వినియోగదారులు ఎంతో ఓపికగా గంటల తరబడి ఉన్న ప్పటికీ నర్వర్ పనిచేయకపోవడంతో కొందరు వెనుతిరిగి వెళ్ళారు. ఈ సందర్భం గా తహశీల్దార్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని 23 గ్రామ పంచాయతీలలో 37 రేషన్ షాపుల ద్వారా 16,067 కార్డుదారులకు రెండవ విడతలో ఒక్కొక్కరికి 5కేజీల బియ్యం, కేజీ శనగలు అందిస్తున్నామన్నారు కరోనా వైరస్ నేపథ్యంలో ఆయా చౌక డిపోల వద్ద కార్డుదారులు సామాజిక దూరాన్ని పాటించి సహకరించాలని కోరారు. ఈరోజు చౌక డిపోలను ఆర్ ఐ నారాయణస్వామి, రాజారమేష్లు పర్యవేక్షించారు.

Leave a Reply