రాబోయే వారం రోజులు అత్యంత కీలకం – డిప్యూటీ సీఎం అంజాద్ భాష

కడప : రాబోయే వారం రోజులు రాష్టరంలో కరోనాను నియంత్రించడంలో అత్యంత కీలకమైన సమయమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ భాష అన్నారు. ఆదివారం కడప నగరంలోని స్థానిక వ డివిజన్ లోని అభిబుల్ల స్టీట్, బండ్లమిట్టవీధి, బి కే యం స్టీట్ లలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని స్పే చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైపోక్లోరైడ్ ద్రావణం స్పే చేయడం వల్ల వీధులలో క్రిమికీటకాలు చనిపోయి కరోనా వైరస్ ను నివారించవచ్చునన్నారు. జిల్లాలో కరోనా నివారణకు ప్రతి ఒకరు లాక్ డౌన్ ను పాటించాలన్నారు. రాబోయే వారం రోజులు కరోనా ను నియంత్రించడంలో అత్యంత కీలకమైన సమయంగా ఉందని అత్యవసర పరిస్థితులలో తప్ప ఇళ్లలో నుంచి ఎవరు బయటకు రాకూడదన్నారు. కరోనా నివారణకు మందు లేదని భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు

Leave a Reply