రెండు లారీలు ఢీ: ముగ్గురి మృతి
రాజంపేట: కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చెన్నై నుంచి కడపవైపు వస్తున్న లారీని కడప నుంచి వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన కంటైనర్‌ ఢీకొని సమీపంలోని ఓ ఇంట్లోకి దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో కడపకు చెందిన లారీ డ్రైవర్‌ మహమ్మద్‌(38), సీకే దిన్నె మండలానికి చెందిన ప్రతాప్‌(22), ఇంటి వద్ద కూర్చున్న వెంకటనర్సయ్య (65) అక్కడికక్కడే మృతి చెందారు. అదే లారీలో ఉన్న మరో ముగ్గురికి, కంటైనర్‌ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరిలించారు. ఘటనా స్థలాన్ని ఆర్డీవో ధర్మచంద్రరెడ్డి, డీఎస్పీ నారయణస్వామిరెడ్డి, సీఐ నర్సింహులు పరిశీలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో స్పీడ్‌ బ్రేకర్‌ ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నా అధికారులు స్పందించలేదని స్థానికులు ఆరోపించారు.
Kade Pavan Kumar Yadav
Latest posts by Kade Pavan Kumar Yadav (see all)
- గండికోటలో తగ్గుతున్న నీటిమట్టం - April 12, 2020
- నాటుసారా స్థావరాలపై దాడి - April 12, 2020
- ఈనెల 15 నుంచి రేషన్ సరుకులు పంపిణీ - April 12, 2020