రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : పసుపు మద్దతు ధర క్వింటాలు 6850/-

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : పసుపు మద్దతు ధర క్వింటాలు 6850/-
పసుపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ భాష

కడప :  ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం విశేష కృషి చేస్తూ “రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా” ముందుకు వెళుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్బాష పేర్కొన్నారు.

                  గురువారం ఉప ముఖ్యమంత్రి వర్యులు డీసీఎంఎస్ వారి ఆధ్వర్యంలో  స్థానిక మార్కెట్ యార్డు నందు పసుపు మద్దతు ధర కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

                     ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నేడు మార్కెట్ యార్డులలో పసుపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందన్నారు. కడప జిల్లాలో కడప, రాజంపేట, మైదుకూరు నియోజకవర్గాలలో పసుపు మద్దతు ధర కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ మూడు ప్రాంతాలలో రైతులు తమ ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించుకోవచ్చునన్నారు. గతంలో రైతులు పండించిన పంటకు  గిట్టుబాటు ధర లేక పండిన పంట కొనేవారు లేక నానా ఇబ్బందులు పడేవారన్నారు. నేడు ప్రభుత్వం క్వింటాలుకు 6850 రూపాయలు మద్దతు ధర ప్రకటించి పసుపు కొనుగోలు చేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. బయట మార్కెట్లో క్వింటాలు పసుపు ధర ఐదు వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారన్నారు. నేడు ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం క్వింటాలు 6850 రూపాయలకు కొనుగోలు చేస్తూ క్వింటాలు పై 1850 రూపాయలు రైతుకు లాభం వచ్చేటట్లు చేస్తుందన్నారు. కావున రైతులు అధైర్య పడకుండా పండించిన పంటలను మార్కెట్ యార్డులలో  ప్రభుత్వం సూచించిన ధరలకు విక్రయించుకోవాలన్నారు. ప్రతి రైతు నుంచి 30  క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.  ప్రతిరోజు టోకెన్ల ప్రకారం కొంత మంది రైతుల సరుకు కొనుగోలు చేస్తారన్నారు. టోకెన్ల ప్రకారం రైతులు తమ ధాన్యాన్ని  మార్కెట్ యార్డులలో విక్రయించుకోవాలన్నారు. రైతులు కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని గుంపులు గుంపులుగా రాకుండా భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరంఉందన్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించి పనులు చేసుకోవాలన్నారు.

                    ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ కల్పన, మార్కెట్ యార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పసుపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ భాష

Leave a Reply