లాక్ డౌన్ వల్ల ఎవరు ఆకలి బాధలతో ఉండకూడదు

ఈనెల 16వ తేదీ నుంచి 27 వరకు రేషన్  కార్డుదారులందరికీ రేషన్ పంపిణీ: లాక్ డౌన్ లో
 రెండవ విడత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ బాషా:

కడప మనం న్యూస్ ఏప్రిల్ 17: – లాక్ డౌన్ వల్ల ఏ ఒక్కరూ ఆకలి బాధలతో అలమటించకూడదని ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్ పంపిణీ  కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ భాష పేర్కొన్నారు.

                 గురువారం ఉప ముఖ్యమంత్రి వర్యులు రామరాజు పల్లి, ఏ ఎస్ ఆర్ నగర్, ఎర్రముక్కపల్లి, గౌస్ నగర్, పాత కడప, దేవునికడప, ప్రకాష్ నగర్ లో రెండవ విడత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

                      ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ నుంచి 27 వరకు తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఉచిత రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కుటుంబంలో ఒక్కొక్కరికి ఐదు కేజీల చొప్పున బియ్యం, కేజీ శనిగలు, ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు టోకెన్ల ద్వారా రేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎక్కువ రేషన్ కార్డులు ఉన్న ప్రాంతంలో రేషన్ షాపులు పెంచి బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మరియు డ్వాక్రా సంఘాల ద్వారా కూడా రేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్డు దారులు గుంపులు గుంపులుగా రేషన్ షాప్ ల యందు ఉండకూడదన్నారు. కరోనా వైరస్  ను నివారించాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక దూరం తో పాటు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలలో కరోనా వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారని మనదేశంలో కరోనా ను నివారించాలంటే సామాజిక దూరం, మాస్కులు ధరించడం, పరిశుభ్రత పాటించడం వంటి పద్ధతులను తప్పక పాటించాలన్నారు.

                 ప్రభుత్వం పేదలను అన్ని విధాలా ఆదుకునేందుకు కార్డుదారులకు వెయ్యి రూపాయలు నగదు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. రేషన్ కార్డు లేని పేదలు సచివాలయంలో దరఖాస్తు సమర్పించుకుంటే వారి దరఖాస్తును పరిశీలించి రేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని కరోనా నివారణకు ప్రజలు సహకరించి ఈ కొద్ది రోజులు ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితులలో తప్ప ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు రాకూడద న్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి వ్యక్తికి మూడు మాస్కులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ నెల 3వ తేదీ వరకూ పొడిగించిన లాక్ డౌన్ ను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.

48 వ డివిజన్ ఏ ఎస్ ఆర్ నగర్ లో నీటి సమస్య డ్రైనేజీ సమస్య ఉందని అక్కడి ప్రజలు ఉప ముఖ్యమంత్రి వర్యులకు తెలిపారు. దీంతో స్పందించిన ఎ ఆయన ఈ ప్రాంతంలో నీటి సమస్య లేకుండా ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి  డ్రైనేజీ సమస్య కూడా వెంటనే పరిష్కరిస్తామని ఆ ప్రాంత ప్రజలకు తెలిపారు.

                ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ మాలోల, తాసిల్దార్  శివరామి రెడ్డి, డివిజన్ ఇంచార్జి లు సుబ్బరాయుడు, లక్ష్మయ్య, జహీర్, సుబ్బారెడ్డి, చెన్నయ్య, బాబు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply