వైద్య సబ్బందికి భద్రత కల్పించడం అభినందనీయం పాత్రికేయులకు కూడా బీమా కల్పించేందుకు కృషి ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు

వైద్య సబ్బందికి భద్రత కల్పించడం అభినందనీయం పాత్రికేయులకు కూడా బీమా కల్పించేందుకు కృషి ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు

రైల్వే కోడూరు : కరోనా వైరస్ ప్రభావంతో తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వైద్యమందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది పై అక్కడ క్కడ దాడులు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆర్థినెన్స్ తీసుకురావడం ఎంతో ఆనందదాయకమని స్టానిక శాసనసభ్యులు, ప్రభుత్వివ్ కొరముట్ల. శ్రీనివాసులు పేర్కొ న్నారు. ఈరోజు రైల్వేకోడూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకుందని ప్రతి ఆరోగ్య కార్యకర్తకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం హర్షదాయకమన్నారు. ఇదేకోవలో కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో సమాజంలో జరుగుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు అందిస్తూ ప్ర ధాన భూమికను పోషిస్తున్న మీడియాను కూడా ఈ ఆర్డినెన్స్ పరిధిలోకి తీసుకువచ్చేలా, బీమా కల్పించేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో కోవిడ్-19 నివారణ కోసం తమ ప్రభుత్వం మొదటి నుంచి ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపడు తోందని ఈ నేవథ్యంలో దేశవ్యాప్తంగా 10లక్షల మందికి టెన్షులు నిర్వహిస్తుండగా రాష్ట్రంలో 10 లక్షల జనాభాకు 830 టెన్టులు నిర్వహించడం జరుగుతోందన్నారు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలెవరూ పస్తులు ఉండకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం పేదకుటుంబాలకు మూడు దఫాలుగా నిత్యావస రాలను అందించడం జరుగుతోందన్నారు.

Leave a Reply