సెక్స్‌ను మరింత ఎంజాయ్ చేయాలంటే..? వీటిని రోజూ 60 గ్రాములు తీసుకోండి
పెళ్లయిన ప్రతి ఒక్కరూ శృంగారాన్ని ఆస్వాదించాలని, భాగస్వామితో ఎంజాయ్ చేయాలని భావిస్తుంటారు. సెక్స్ స్టామినా పెంచుకోవడం కోసం ఏం చేయడానికైనా చాలా మంది సిద్ధంగా ఉంటారు. మంచి ఆహారం తీసుకోవడం, రోజూ ఎక్సర్సైజ్ చేయడం; స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి దురలవాట్లకు దూరంగా ఉండటం వల్ల శృంగారం పట్ల ఆసక్తి పెరగడంతోపాటు సెక్స్‌ను ఎక్కువ సేపు ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. శృంగారాన్ని మరింతగా ఎంజాయ్ చేయాలని, లైంగిక ఆసక్తిని పెంచుకోవాలని భావిస్తున్న వారు రోజూ 60 గ్రాముల నట్స్ తినడం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.
తక్కువగా పండ్లు, కాయగూరలు తీసుకుంటూ.. ఎక్కువగా మాంసాహారం తినే 83 మందిని 14 వారాలపాటు పరిశీలించిన పరిశోధకులు ఈ వివరాలను వెల్లడించారు. వాల్నట్స్, బాదం తినడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ పెరుగుతుంది.
40 ఏళ్ల లోపు వారిలో రెండు శాతం మంది పురుషుల్లో అంగస్తంభన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 40-70 ఏళ్ల మందిలో 52 శాతం మంది, 80 శాతం దాటిన వారిలో 85 శాతం మంది అంగ స్తంభన సమస్యలను ఎదుర్కొంటున్నారని పరిశోధకులు తెలిపారు. స్మోకింగ్, మితిమీరి మద్యం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి.
Source : Samayam
Kade Pavan Kumar Yadav
Latest posts by Kade Pavan Kumar Yadav (see all)
- గండికోటలో తగ్గుతున్న నీటిమట్టం - April 12, 2020
- నాటుసారా స్థావరాలపై దాడి - April 12, 2020
- ఈనెల 15 నుంచి రేషన్ సరుకులు పంపిణీ - April 12, 2020