నాన్‌వెజ్‌కి సమానమైన శనగలు.. తింటే ఇన్ని లాభాలా..
మనలో చాలామంది వెజిటేరియన్స్, ఎగ్‌టేరియన్స్ ఉంటారు. నాన్‌వెజిటేరియన్స్‌తో పోలిస్తే.. వీరు తక్కువ పోషకాలు తీసుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే.. వీరు మాంసం ముట్టరు. మాంసప్రియులైతే రెండు తీసుకుంటారు. మరి ఇలాంటివారు అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ తీసుకోవాలంటే కొన్ని సెలెక్టెడ్ ఐటెమ్స్ తీసుకోవచ్చు. అలాంటి కోవాలోకే వస్తాయి శనగలు. వీటిని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
మన దేశంలో ఎప్పట్నుంచో ఎక్కువగా ఇష్టపడే, ప్రొటీన్ ఎక్కువ ఉండే శనగలలో పోషకాలు,ఆరోగ్య లాభాలు అనేకం ఉన్నాయి. మామూలు శనగలు, కాబూలీ శనగల తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకోండి.. వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉండి, ప్రోటీన్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ శాకాహారులకు ఎంతగానో మేలు చేస్తాయి. రెగ్యులర్‌గా తినడం వల్ల వారికి నాన్వెజిటేరియన్స్ పొందే అనేక లాభాలన్నీ పొందొచ్చు.
దేశీయ వంటకాలలో ముఖ్యంగా శాకాహార వంటల్లో శనగలు చాలా ఇష్టపడి, ఆదరించబడే పదార్థం. పోషణపరంగా, శనగలు ఆరోగ్యానికి కావాలసిన రెండు ముఖ్యమైన పోషకాలైన ప్రొటీన్లు, పీచుపదార్థంతో నిండి ఉంటాయి. శాకాహారులకి మధ్యధరా ప్రాంతానికి చెందిన వంటకమైన డిప్ హుమ్ముస్ చాలా మంచి పోషకాహారమని నమ్మకం, ఎందుకంటే అందులో ఎక్కువ శనగలు వాడతారు. కానీ ఈ రోజుల్లో, వీగనిజం ట్రెండ్‌లో ఉండి పాపులర్ అయినందు వల్ల, శనగలు ప్రపంచంలోని అన్ని రకాల వంటకాలలో భాగం అవుతున్నాయి.
శాకాహారులందరికీ శనగలు ఎందుకంత మక్కువో ఇప్పటికి మీకు అర్థమయ్యే ఉంటుంది – అందులో మంచి నాణ్యత,పరిమాణం కలిగిన ప్రొటీన్లు ఉంటాయి, ఇవి కేవలం ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహారం తినేవారికి దొరకడం కష్టం కావచ్చు. చిక్కుళ్ళలో కూడా ప్రొటీన్లు ఎక్కువే ఉంటాయి. కానీ శనగలను అనేక రకాలుగా, చాలా వంటకాలలో పోషణ,రుచి రెండింటి మేలు కలయికగా వాడవచ్చు. సామాన్యంగా కాబూలీ శనగలుగా పిలిచే ఈ శనగలలోని మొక్క ఆధారిత ప్రొటీన్, మీకు ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా కావాలంటే వీటిని ఎక్కువగా తినొచ్చు.
శనగలలో పోషకవిలువలు
మన దేశంలో పండే కాబూలీ శనగలలో ఎన్ని పోషకవిలువలు ఉన్నాయంటే ఫిట్నెస్ ఇష్టపడేవారికి సరైన ఆహారమని చెప్పుకోవచ్చు. 100 గ్రాముల ఉడికించిన శనగలలో 9 గ్రాముల ప్రొటీన్, 8 గ్రాముల ఆహార ఫైబర్ ఉంటుంది. యునైటడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నివేదికల ప్రకారం కొలెస్ట్రాల్ అసలు ఉండదు. అయితే, మాములుగా అయితే, 2.6గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది, ఐరన్, మెగ్నీషియంలు ఎక్కువగా ఉంటాయి. 164 కేలరీలతో ఈ శనగలతో చేసే వంటకం బానే కడుపు నింపుతుంది కూడా.
శనగలతో పోషణ
మధ్యధరా ప్రాంతపు డిప్ హుమ్ముస్ ని ఉడికించిన శనగలతో చేస్తారు. ఇది ఎంతగానో టేస్టీగా ఉంటుంది. అక్కడ ఇది ఫేమస్ అని చెప్పొచ్చు.
శనగలతో లాభాలు
బెంగాల్ గ్రామ్ లేదా ఈజిప్షియన్ పీస్ గా ప్రసిద్ధమైన శనగల లాభాలు ఇవిగో కొన్ని:
1. బరువు నియంత్రణ
ఎక్కువగా ప్రొటీన్, పీచుపదార్థం ఉండటం అంటే శనగలు బరువు తగ్గడానికి సరిపడే ఆహారమని అర్థం. ప్రొటీన్, పీచుపదార్థం రెండూ కడుపు నింపి, ఎక్కువసేపు ఆకలి లేకుండా చేసి, బరువు నియంత్రణలో సాయపడతాయి. కాబట్టి డైట్ చేసే వారు వీటిని ఎక్కువగా తీసుకోవచ్చని చెబుతారు. వీటిని ఎలా తిన్నా సరైన ప్రయోజనాలు ఉంటాయి.
2. మధుమేహం నియంత్రణ
శనగల్లోని పీచుపదార్థం రక్తంలోని చక్కెరస్థాయిని, కొవ్వుల స్థాయిని తగ్గించి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను కూడా మెరుగ్గా నియంత్రించటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఎక్కువ పీచుపదార్థాలు ఉన్న ఆహారం వల్ల డయాబెటిస్,రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం వంటి రిస్కులు తగ్గుతాయి. కాబట్టి డయాబెటీస్ వీటిని ఎక్కువగా తింటే చాలా మంచిది.
3. ఎముకల ఆరోగ్యం మెరుగుపరుస్తాయి
శనగలు ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తాయి. ఎందుకంటే వీటిల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ అలాగే విటమిన్ కె వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ అన్ని పోషకాలు శరీరంలో ఎముకలు బలంగా ఉండటానికి అవసరం. కాల్షియం లేమితో బాధపడేవారు శనగలను తినడం వల్ల ఫలితం ఉంటుంది.
4. గుండె ఆరోగ్యం పెంచుతాయి
2006లో ఆనల్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజంలో ప్రచురితమైన అధ్యయనంలో శనగలు తినటానికి, చెడు కొలెస్ట్రాల్ లేదా లో డెన్సిటీ లిపోప్రొటీన్ (ఎల్ డిఎల్) స్థాయి తగ్గటానికి మధ్య సంబంధం గురించి వివరించారు. ఎక్కువ కొలెస్ట్రాల్ బలహీనమైన గుండె ఆరోగ్యాన్ని సూచిస్తుంది కాబట్టి, శనగలు తినటం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడవచ్చు. వీటిని తినడం వల్ల కొవ్వు శాతం పెరగదు కాబట్టి.. హాయిగా తినొచ్చు.
5. నాడీవ్యవస్థ, కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
శనగల్లో ఉండే విటమిన్ బి9 లేదా ఫోలేట్ మెదడు, కండరాల సరైన అభివృద్ధికి అలాగే నాడీవ్యవస్థ చక్కగా పనిచేయటానికి, సరైన మెటబాలిజం వంటివాటికి ఉపయోగపడుతుంది. ఇది ఇంకా కాలేయంలోని కొవ్వు జీర్ణమవ్వటంలో సాయపడి కాలేయం బాగా పనిచేసేలా చేస్తుంది.
6. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది..
శనగలలో పీచుపదార్థం ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల జీర్ణ సమస్యలు ఏవైనా సరే తగ్గిపోతాయని చెబుతున్నారు.
అందుకని ఒకవేళ మీ డైట్లో ఇప్పటికే శనగలు లేకపోతే, ఆరోగ్యకరమైన గుండె, మెదడు ఇంకా శరీరం కోసం శనగలను కూడా వంటకాలలో వాడుతూ తినడానికి ప్రయత్నించండి. వీటిని స్నాక్స్‌లా కూడా చక్కగా తినొచ్చు. తక్కువ ఖర్చుతోనే దొరికే ఇంత చక్కని ఆహారం వదిలి లేని పోని బయటి ఆహారాన్ని తిని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవద్దు.
Source : Samayam
Kade Pavan Kumar Yadav
Latest posts by Kade Pavan Kumar Yadav (see all)
- గండికోటలో తగ్గుతున్న నీటిమట్టం - April 12, 2020
- నాటుసారా స్థావరాలపై దాడి - April 12, 2020
- ఈనెల 15 నుంచి రేషన్ సరుకులు పంపిణీ - April 12, 2020